ఫీడ్‌ ద నీడ్‌: ఛారిటీ నెక్స్‌ట్‌ లెవల్‌.!

- June 18, 2018 , by Maagulf
ఫీడ్‌ ద నీడ్‌: ఛారిటీ నెక్స్‌ట్‌ లెవల్‌.!

'ఫీడ్‌ ది నీడ్‌' పేరుతో పేదలకు కడుపు నింపే ఓ కార్యక్రమానికి బహ్రెయినీల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సూపర్‌ మార్కెట్స్‌, హోటల్స్‌, రెస్టారెంట్స్‌ నుంచి ఈ ఇనీషియేటివ్‌ ద్వారా ఫుడ్‌ని కలెక్ట్‌ చేసి, బహ్రెయిన్‌లో పూర్‌ పీపుల్‌కి అందిస్తున్నారు. గత ఐదేళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫ్రిజ్‌లలో దాచి, ఆహారాన్ని అవసరమైనవారికి అందించేందుకు మరిన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం ద్వారా ఎక్కువమందికి లబ్ది చేకూర్చాలన్నదే ఈ ప్రోగ్రామ్‌ లక్ష్యం. బహ్రెయిన్‌లో మొత్తం 20 ఫ్రిజల్‌ ద్వారా ఈ ఆహార పదార్థాల్ని సేకరిస్తున్నారు. ఈ ఫ్రిజ్‌లను పెద్ద మనసుతో కొందరు డొనేట్‌ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆస్ట్రియన్‌ గవర్నమెంట్‌ వెల్‌ఫేర్‌ సిస్టమ్‌ తరఫున పనిచేసిన బెయిలీ మాట్లాడుతూ, బహ్రెయినీ పార్టనర్‌తో కలిసి సోషల్‌ ఎంటర్‌ప్రైజ్‌ని స్థాపించి, ఫుడ్‌ని కలెక్ట్‌ చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com