సీనియర్ సిటిజన్స్ కోసం సూపర్ ఫోన్..
- June 18, 2018
సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ వరల్డ్ అనే కంపనీ 'ఈజీ ఫోన్ గ్రాండ్' పేరుతో ఒక ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ వినికిడి సమస‍్య ఉండే సీనియర్ సిటిజన్స్, వినికిడి సాధనాలు ఇష్టపడని వారికి బాగా ఉపయోగపడుతోందని చెబుతోంది. పెద్ద స్క్రీన్ , పెద్ద ఫాంట్ సైజ్, డయలింగ్ కీలు కూడా పెద్దవిగా, ఫోటో డయిల్ వంటివి ఉండటమే కాక..నాలుగు ఆటోమేటెడ్ పనులను చేసే ఎస్ఓఎస్ బటన్‌తో పాటు ఇంకా ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులు, వాటికి కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం, ఇన్ కామింగ్ కాల్స్ లిస్ట్ ఇలా మరెన్నో సీనియర్ సిటిజన్స్ కు ఉపయోగపడే టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి. అయితే ఫోన్ కేవలం రూ. 3,990కే లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది తమ అధికారిక వెబ్సైటు అయిన సీనియర్ వరల్డ్.కామ్ అలాగే అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఈబే ఇండియా లలో కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







