ఈ నెల 21న 'పేపర్ బోయ్' ఫస్ట్ లుక్

- June 18, 2018 , by Maagulf
ఈ నెల 21న  'పేపర్ బోయ్' ఫస్ట్ లుక్

ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతం నంద లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది తన నిర్మాణంలో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఓ పక్క డైరక్షన్ చేస్తూ నిర్మాతగా గాలిపటం సినిమా తీసిన సంపత్ నంది ఇప్పుడు నూతన దర్శకుడు జయశంకర్ ను పరిచయం చేస్తూ పేపర్ బోయ్ సినిమా చేస్తున్నాడు. ఆయన సొంత నిర్మాణ సంస్థ "సంపత్ నంది టీం వర్క్స్", ప్రచిత్ర క్రియేషన్స్-బి.ఎల్.ఎన్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ "పేపర్ బోయ్ ను నిర్మించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఈ నెల 21 వ తేదిన విడుదల చేయనుంది ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కళ: రాజీవ్ నాయర్, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల, నిర్మాతలు: సంపత్ నంది-వెంకట్-నరసింహ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు: సంపత్ నంది, దర్శకత్వం: జయశంకర్!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com