పూరి అండ్ నాని.. కొత్త సినిమా ఒకే అయ్యింది!
- June 18, 2018
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ గా ఇండస్ట్రీ హిట్లు సైతం కొట్టిన పూరి జగన్నాథ్ హిట్ కోసం తహతహలాడుతున్నాడు. తనయుడు హీరోగా చేసిన మెహబూబా కూడా ఫ్లాప్ అవడంతో డీలా పడ్డ పూరి కొద్దిపాటి గ్యాప్ తో మళ్లీ సినిమాకు సిద్ధమయ్యాడు. ఈసారి ఒకటి కాదు రెండు సినిమాలను వెంట వెంటనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. అది కూడా పూరి నిర్మాణంలోనే ఉంటాయని తెలుస్తుంది.
అందులో ఒకటి పూరి కొడుకునే పెట్టి సినిమా చేస్తాడట ఈసారి మార్షల్ ఆర్ట్స్ తో ఈ సినిమా ఉంటుందట. సినిమా మొత్తం యూఎస్ లో షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని అంటున్నారు. ఇక పూరి-నాని కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. ఇటీవల పూరి నాని మధ్య చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. నాని జెర్సీ సినిమా తరువాత పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందట.
అయితే పూరి సినిమాలో మాస్ హిరోగా పూరి స్టైల్ లో కనిపిస్తాడట. పూరి కూడా ఈ గ్యాప్ లో కొడుకు ఆకాశ్ తోనే మరో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!