పారిస్:ట్రైన్లో పుట్టాడు.. అదృష్టం పట్టేశాడు
- June 20, 2018
పారిస్:ఇక్కడా, అక్కడా పుడితే అదృష్టం వరించదండీ.. ప్యారిస్‌లో.. అది కూడా అక్కడి ట్రైన్లో పుడితేనే 25 ఏళ్లవరకు ఉచితంగా రైలు ప్రయాణం చేయవచ్చు. ఇది అందరికీ వర్తిస్తుందో లేదో తెలియదు కానీ ఓ బుజ్జాయికి మాత్రం ఇది వర్తింపజేసారు రైలు అధికారులు. అనుకున్న సమయాని రైలు రాలేదు. ఆలస్యంగా వచ్చింది. దాంతో రైలెక్కి ఆసుపత్రికి వెళ్లాలనుకున్న ఓ మహిళ ఆలస్యంగా వచ్చిన రైలెక్కి పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతోంది. పక్కనే ఉన్న మిగిలిన ప్రయాణీకులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది వెంటనే స్పందించి ఓ స్టేషన్లో రైలుని ఆపేశారు. 15 మంది ప్రయాణీకులు రైల్వే సిబ్బంది సహాయంతో ఆమెకు డెలివరీ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు రైల్వే అధికారులు అభినందనలు తెలియజేసారు. సుఖ ప్రసవం జరగడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ శుభసందర్భంలో ఆమెకు ఓ బహుమతి కూడా ఇచ్చారు. బాబుకి 25 ఏళ్లు వచ్చే వరకు రైల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పారిస్ మెట్రో ప్రకటించింది. రైల్లో ప్రయాణించేటప్పుడు గర్భిణులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సిబ్బంది అప్రమత్తమైన విషయాన్ని అన్ని స్టేషన్లలో డిస్ప్లే చేయించారు రైల్వే అధికారులు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!