400కి పైగా థియేటర్లలో ఈ నెల 29న 'యుద్ధభూమి'

- June 20, 2018 , by Maagulf
400కి పైగా థియేటర్లలో ఈ నెల 29న 'యుద్ధభూమి'

1971 లో భారత సరిహద్దుల్లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మలయాళంలో మోహన్ లాల్, అల్లు శిరీష్ ముఖ్య పాత్రలలో నటించి తెరకెక్కిన చిత్రం 1971 బియాండ్ బార్డర్స్. మేజర్ రవి దర్శకత్వం వహించారు. గత ఏడాది మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్నిజాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బేనర్స్ పై ఏయన్ బాలాజీ యుద్ధభూమి పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 29న 400 కి పైగా థియేటర్ లలో విడుదలకు సిద్దమవుతుంది. బిజినెస్ పరంగా డిస్ట్రిబ్యూటర్స్ నుండి అనూహ్య స్పందన వచ్చింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏయన్ బాలాజి మాట్లాడుతూ...ఈ చిత్ర దర్శకుడైన మేజర్ రవిగారు నిజ జీవితంలో కూడా మేజర్ కావడం విశేషం. ఈయన 1981లో ఆర్మీలో చేరి అనేక కీలక ఆపరేషన్స్ ని లీడ్ చేసారు. మేజర్ రవి 2002 సంవత్సరంలో మొదటిసారిగా మెగాఫోన్ పట్టి పునర్ జని అనే మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించారు. అప్పటి నుండి ఆయన తనకున్న దేశభక్తిని నిరూపిస్తూ తాను ఆర్మీలో పని చేసే సమయంలో జరిగిన ఆపరేషన్స్ కి సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. మేజర్ రవి ప్రతి సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ యువతలో దేశభక్తిని కలిగిస్తూ విజయం సాధించినవే.

ఇక ఈ చిత్ర కథ విషయానికొస్తే..1971 లో భారత్ -పాక్ బార్డర్ లో జరిగే వార్ నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా సినిమా రూపొందింది. ముఖ్య పాత్రలలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్‌, టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి తనయుడు అల్లు శిరీష్ నటించారు. ఈ చిత్రంలో మేజర్‌గా మోహన్ లాల్ ,ఎనర్జిటిక్ అండ్ యంగ్ డైనమిక్ సోల్జర్ గా అల్లు శిరీష్ కనిపిస్తారు. గతంలో నేను తమిళం, మలయాళం, హిందీ చిత్రాలను తెలుగులోకి అనువదించాను.

నేను రిలీజ్ చేసిన ప్రతి చిత్రం విజయం సాధించినదే. ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. యుద్దభూమిచిత్రాన్ని జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః సిద్ధార్ద్ విపిన్‌ డైలాగ్స్ః ఎమ్‌.రాజశేఖర్ రెడ్డి; కెమెరాః సుజిత్ వాసుదేవ్‌ నిర్మాతః ఏయన్ బాలాజీ (సూపర్ గుడ్ బాలాజీ); దర్శకత్వంః మేజర్ రవి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com