ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నమోడీ
- June 20, 2018
డెహ్రాడూన్:నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో 55 వేలమంది పాల్గొన్నారు. అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనకు మన ప్రాచీన భారతీయులు అందించిన బహుమతి అని అన్నారు మోడీ. యోగా అనేది అన్ని పనులపై ఏకాగ్రతను పెంచడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో సద్భావనను కల్పిస్తుందని అన్నారు.
యోగా అతితక్కువ సమయంలోనే ప్రపంచంలోని నలుమూలలా వ్యాప్తి చెందుతోందని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను కూడా ఓ భాగంగా చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగ సాధనతోనే శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని, అందుకే ప్రపంచదేశాలు యోగాను పాటిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇక హైదరాబాద్ లో కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖా భారీ యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







