బుర్‌ దుబాయ్‌లో ఖేలైయా వర్క్‌ షాప్‌

- June 21, 2018 , by Maagulf

దుబాయ్:గార్భా మరియు సల్సా ఫ్యుజన్‌ డాన్స్‌కి సంబంధించి ఖేలైయా వర్క్ షాప్‌ని రాయల్‌ ఆస్కాట్‌, బుర్‌ దుబాయ్‌లోని స్ప్రీ క్లబ్‌లో జూన్‌ 16 నుంచి 19 వరకు నిర్వహించారు. 4 రోజులపాటు సాగిన ఈ వర్క్‌ షాప్‌లో 80 మందికి పార్టిసిపెంట్లు పాల్గొన్నారు. ఆండియా కింగ్‌ జెనిష్‌ వ్యాస్‌ నుంచి డాన్సుల్ని నేర్చుకున్నారు. దుబాయ్‌లో ప్రముఖ సోషల్‌ మరియు మీడియా పర్సనాలిటీ కోమల్‌ సెలార్కా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్‌ జో మోహన్‌ అలియాస్‌ వాయిజ్‌ గై జో ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డాక్టర్‌ శైలేష్‌ ఉపాధ్యాయ్‌, చంద్రికా గడివి, డిజె కరణ్‌ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వీరంతా ఆయా రంగాల్లో తమదైన ప్రత్యేకతను సంతరించుకున్నారు. విజేతలకు ప్రత్యేకంగా బహుమతులు అందజేయగా, పాల్గొన్న ప్రతి పార్టిసిపెంట్‌కీ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని కోమల్‌ సెలార్కా, ఆమె పార్టనర్స్‌ అయిన భాగ్యశ్రీ చందన్‌ మరియు వాణి ద్వివేది నిర్వహించారు. దర్పన్‌ త్రివేది, సైద్‌ సఫ్దార్‌ రజా సహాయ సహకారాలు అందించారు. ఇదే తరహాలో మరో డాన్స్‌ ఈవెంట్‌ త్వరలో నిర్వహించనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com