మహేష్ సినిమాకు ఆ ముగ్గురు
- June 21, 2018
మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న వంశీ పైడిపల్లి చిత్రం గత మూడు రోజులు నుండే షూటింగ్ స్టార్ట్ అయింది. డెహ్రడూన్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎప్పటి నుండో మహేష్ తో ఈ సినిమా చేయాలనీ ఖాళీగా ఉన్నాడు డైరెక్టర్ వంశీ. మహేష్ కూడా వంశీకి కావాల్సినంత సమయం ఇచ్చి పక్కాగా స్క్రిప్టు రెడీ చేయించాడు.
ఈ చిత్రాన్ని దిల్ రాజు.. అశ్వినీదత్ లాంటి ఇద్దరు అగ్ర నిర్మాతలు నిర్మిస్తున్నారు. అయితే మొదట్లో ఈ సినిమాను నిర్మించే హక్కులు నావి అని కోర్టులో న్యాయపోరాటం చేసి తిరిగి మళ్లీ ఈ సినిమాలో భాగస్వామి అయ్యాడు పొట్లూరి వరప్రసాద్. ఇప్పుడు ఈ సినిమాకి ముగ్గురు నిర్మాతలు. దిల్ రాజు.. అశ్వినీదత్.. పొట్లూరి వరప్రసాద్. గతం లో వీరి బ్యానర్స్ లో మహేష్ సినిమాలు చేసాడు.
ఇప్పుడు మహేష్ ల్యాండ్ మార్క్ సినిమాకు ఈ ముగ్గురు బాధ్యత తీసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. వైజయంతీ మూవీస్.. పీవీపీ సినిమా ఈ మూడు బేనర్ల పేర్లు ఒకే పోస్టర్ మీద పడటం అరుదైన విషయమే. మరి ఈ ముగ్గురు నిర్మాతలు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో.. ఎంత ఖర్చు పెడతారో.. మహేష్‌తో ఎలాంటి సినిమా తీస్తారో చూద్దాం
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







