వాట్సాప్ లో మరో అదిరిపోయే కొత్త ఫీచర్ ఏంటో మీరే చూడండి.
- June 22, 2018
ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌ను వినియోగదారుల కోసం తీసుకురాబోతుంది.
స్టిక్కర్స్
ఇప్పటికే ఎమోజీల రూపంలో అలరిస్తుండగా.. ఇప్పటికే ఫేస్బుక్లో ఉన్న 'స్టిక్కర్స్'ను వాట్సాప్‌లోనూ పెట్టాలని వాట్సాప్ నిర్ణయించింది. మొదట ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఈ వారంలోనే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
బీటా వెర్షన్లలో
ఇప్పటికే ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్లలో పెట్టినా.ప్రస్తుతానికి డిసేబుల్ చేసింది. వారంలో ఎలాగూ ఆండ్రాయిడ్ యూజర్లకు దానిని అందుబాటులోకి తెస్తున్నారు కాబట్టి.. బీటా వెర్షన్లోనూ అప్పుడే ఎనేబుల్ చేస్తామని సంస్థ తెలిపింది. గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాంలో ఈ స్టిక్కర్లకు సంబంధించిన సమాచారాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫో ఉంచింది.
వివిధ రకాల భావోద్వేగాలతో ఈ స్టిక్కర్ ఎమోజీలను క్రియేట్ చేసింది. లోల్, లవ్, సాడ్, వావ్ వంటి నాలుగు రకాల రియాక్షన్లను ఈ ఎమోజీల ద్వారా చెప్పేందుకు వీలు కల్పిస్తోంది. అవేకాకుండా మరిన్ని ఎమోజీలనూ డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..