టార్గెట్ ఈబీ-5
- June 23, 2018
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుల కన్ను ఇప్పుడు ఈబీ-5 వీసాలపై పడింది. గత కొన్ని రోజులుగా హెచ్-1బీ వీసా విధానాల్లో మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్న ఆయన... తాజాగా ఈబీ-5 వీసాలపై సంస్కరణలు, లేదా ఏకంగా ఎత్తి వేయాలని ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వీసా ద్వారా విదేశీయులు ... యూఎస్ లో కనీసం మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అలాంటి వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వినియోగం జరుగుతోందని, అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ యంత్రాంగం వాదన. ఈ నేపథ్యంలో ఈబీ-5 వీసా విధానంపై దృష్టి పెట్టారు.
ఈబీ-5 కోసం అప్లై చేసుకున్న దేశాల్లో భారత్ ది మూడోస్థానం. మొదట చైనా, రెండో స్థానంలో వియత్నాం ఉంది. ఈ వీసాను దుర్వినియోగం చేస్తున్నారని చైనాపై ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. గత ఏడాది భారత్ తరఫున 500 ఈబీ-5 వీసా దరఖాస్తులు ఫైల్ అయ్యాయి. ఈ ఏడాది దాదాపు 700 అప్లికేషన్స్ ఫైల్ అయ్యే అయ్యే అవకాశం ఉంది.
ఈబీ-5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీయులకు వీసాలు ఇస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. భారత్ నుంచి కూడా రోజు రోజుకు ఈబీ-5 వీసా కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చండీగఢ్ , పంజాబ్, ఢిల్లీ, ముంబయి, తమిళనాడు, కర్నాటకలో నుంచి ఉన్నారు.2016లో 50 మంది ఆయా రాష్ట్రాల నుంచి ఈబీ-5 వీసా తీసుకోగా.. 2017లో 97 మంది, ఈ ఏడాది 200 మంది వరకు ఉంటారని అంచనా.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







