ఆదితో సురభి

- June 23, 2018 , by Maagulf
ఆదితో సురభి

ఆదితో సురభి సాయికుమార్‌ తనయుడు ఆది కథానాయకుడిగా శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీనివాసనాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాస్‌, చావలి రామాంజనేయులు నిర్మాతలు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరగబోతోంది. కథానాయికగా సురభిని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''కథ చాలా బాగా కుదిరింది. ఆదిని ఓ కొత్త కోణంలో చూస్తారు. రావు రమేష్‌, రాధిక, రాజీవ్‌ కనకాల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయ''న్నారు. అరుణ్‌ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాంబ భీమవరపు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com