హీరో విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన కేటీఆర్!
- June 24, 2018
అర్జున్‌రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగారు. సినిమా విడుదలై ఏడాది గడుస్తున్నా.. ఇంకా అర్జున్ రెడ్డిని మర్చిపోలేక పోతున్నారు సినీ జనాలు. అర్జున్ రెడ్డి నటనకు గానూ విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ విషయంపై కేటీఆర్ స్పందిస్తూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.
తాజాగా కేటీఆర్ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని విజయ్ ట్విటర్ ద్వారా తెలుపుతూ.. మీ ఇంటికి లంచ్ చేయడానికి మీకు ఇష్టమైన నాయకుడు వస్తే ఎలా ఉంటుంది? ఒక్క నిమిషం.. అసలు ఏం జరుగుతోంది బాసూ.. బేసికల్లి ఏమైనా జరుగొచ్చు. మనకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే...అంటూ ఆనందంతో కూడిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







