ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఉద్యోగావకాశాలు

- June 24, 2018 , by Maagulf
ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఉద్యోగావకాశాలు

పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌- రెగ్యులర్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌, సీనియర్‌ రెసిడెంట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 59
ఉద్యోగాల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 20, సీనియర్‌ రెసిడెంట్లు 18, జూనియర్‌ రెసిడెంట్లు 21
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విభాగాలు: బయోకెమిస్ట్రీ-1, ఫార్మకాలజీ-1, పాథాలజీ-1, అనస్థీషియాలజీ-2, రేడియో డయాగ్నోసిస్‌-3, జనరల్‌ మెడిసిన్‌-1, మెడిసిన్‌ కార్డియాలజీ-1, మెడిసిన్‌ న్యూరాలజీ-1,
మెడిసిన్‌ నెఫ్రాలజీ-1, న్యూరో సర్జరీ-1, సర్జరీ యూరాలజీ-1, సర్జరీ గ్యాస్ట్రోఎంటరాలజీ-1, పీడియాట్రిక్స్‌-1, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ-1, ఆర్థోపెడిక్స్‌ -2, ఈఎన్‌టీ-1 
సీనియర్‌ రెసిడెంట్‌ విబాగాలు: జనరల్‌ మెడిసిన్‌ 4, టీబీ అండ్‌ చెస్ట్‌ 1, ఈఎన్‌టీ 2, జనరల్‌ సర్జరీ 2, ఆర్థోపెడిక్స్‌ 2, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ 2, అనస్థీషియాలజీ 2, డెర్మటాలజీ 1, రేడియో డయాగ్నోసిస్‌ 2 
ఒప్పంద వ్యవధి: సీనియర్‌, జూనియర్‌ రెసిడెంట్లకు ఏడాది (తదుపరి రెండేళ్ల పొడిగింపు ఉంటుంది) 
నెలవారీ వేతనం: సీనియర్‌ రెసిడెంట్లకు రూ.52,000 జూనియర్‌ రెసిడెంట్లకు రూ.43,000 
అర్హత: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధిత విభాగం లో ఎండీ / ఎంఎస్‌ / డీఎం / ఎంసీహెచ్‌. గుర్తింపు పొందిన మెడికల్‌ కాలేజీలో మూడేళ్లు జూనియర్‌ రెసిడెంట్‌గా ఏడాది సీనియర్‌ రెసిడెంట్‌గా పనిచేసి ఉండాలి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా గుర్తింపు తప్పనిసరి. సీనియర్‌ రెసిడెంట్లకు సంబంధిత విభాగంలో పీజీ, జూనియర్‌ రెసిడెంట్లకు ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ఉండాలి. 
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు 50 ఏళ్లు, సీనియర్‌ / జూనియర్‌ రెసిడెంట్లకు 40 ఏళ్లు .
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ / ఎస్టీలకు రూ.250)
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ కేంద్రం: పుదుచ్ఛేరీ
వెబ్‌సైట్‌: www.igmcri.com

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com