మిసెస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ హత్య కేసులో సంచలన విషయాలు..

- June 25, 2018 , by Maagulf
మిసెస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ హత్య కేసులో సంచలన విషయాలు..

మేజర్‌ అమిత్ ద్వివేది భార్య మిసెస్‌ ఇండియా ఎర్త్‌ ఫైనలిస్ట్  శైలజ ద్వివేది..మేజర్‌ నిఖిల్ రాయ్‌ హండా చేతిలో శనివారం  దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ  కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమెను మేజర్‌ నిఖిల్‌ హండా గొంతు కోసి హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. తనను పేళ్ళి చేసుకోవాలని  శైలజను నిఖిల్ కోరగా ఆమె  అంగీకరించకపోవడంతో   ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు.  హండాకు శైలజతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. శైలజ భర్త మేజర్‌గా నాగపూర్‌లో విధులు నిర్వహిస్తుండగా సహచర మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజతో నిఖిల్‌కు పరిచయం ఏర్పడింది. వీరి  పరిచయం క్రమంగా వివహేతర సంబంధానికి  దారితీసింది. వీరి బంధం శైలజ  భర్త అమిత్‌కు తేలిసిపోవడంతో ఈ బంధాన్ని తెంచుకోవాలంటూ ఇద్దరినీ హెచ్చరించాడు.భర్త హెచ్చరికతో శైలజ ఇకపై నిఖిల్‌ను కలవొద్దని నిర్ణయించుకొని  అమిత్‌కు ఢీల్లీకి బదిలి అవడంతో అతనితో కలిసి ఢిల్లీకి వచ్చేసింది.కానీ నిఖిల్ అమిత్ హెచ్చరికను ఖాతరు చేయలేదు. శైలజను కలవడానాకి  ప్రయత్నిస్తుండేవాడు. శనివారం ఆమెను  కలిసి కారులో ఎక్కుంచుకొని  వేళ్ళాడు.  కారులో  ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో హండా కత్తితో శైలజ గొంతును కోశాడు. వీరిద్దరూ అరు నెలలో దాదాపు 3300 కాల్స్ మాట్లాడుకునట్టు పోలీసులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com