మేమే నంబర్ వన్
- June 26, 2018
గత నాలుగేళ్లలో తెలంగాణ ఆదాయాభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెబ్ సైట్లో వెల్లడించింది. 17.2 శాతం వృద్ధితో తెలంగాణ రాష్ట్ర స్వీయ ఆదాయం మిగతా రాష్ట్రాలతో పోల్చితే ముందంజలో ఉందని తెలిపింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రగతి కాముక ఆర్థిక విధానాలు, పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణతో పాటు పన్నుల చెల్లింపులో ప్రజలు చూపిస్తున్న చిత్తశుద్ధి వల్లనే ఆదాయాభివృద్దిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని సీఎం కేసీఆర్ చెప్పారు.
గత నాలుగేళ్లలో ఆదాయాభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచింది. 17.2 శాతం వృద్ధితో తెలంగాణ రాష్ట్రం స్వీయ ఆదాయం... మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉన్నట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పేర్కొంది.
2014 జూన్ నెల నుంచి 2018 మే వరకు వివరాలను సిఎజి ప్రకటించింది. మొత్తం నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం 17.2 శాతం వృద్ధి రేటు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 14.2 శాతంతో రెండో స్థానంలో హర్యానా, 13.9 శాతంతో మూడో స్థానంలో మహారాష్ట్ర, 12.4 శాతంతో నాలుగో స్థానంలో ఒడిషా, 10.3 శాతంతో ఐదో స్థానంలో పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మిగతా రాష్ట్రాలన్నీ 10 శాతం లోపు వృద్దిరేటు సాధించాయి. తెలంగాణ రాష్ట్రం 2015-16లో 13.7 శాతం, 2016-17లో 21.1 శాతం, 2017-18లో 16.8 శాతం వృద్దిరేటు సాధించాయి. గత నాలుగేళ్లలో రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు దేశంలోనే తొలిస్థానంలో ఉందని కాగ్ చేసిన ప్రకటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఆర్థిక క్రమశిక్షణ, పన్నుల చెల్లింపులో ప్రజల చిత్తశుద్ధి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నోట్ల రద్దు , జీఎస్టీ వంటి నిర్ణయాల తర్వాత కూడా స్థిరమైన వృద్ధి సాధించామని చెప్పారు. ఆదాయ వృద్ధితో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిన్ని అమలు చేయవచ్చని కేసీఆర్ అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..