దోమకొండ గడికోటపై హీరో రామ్ చరణ్ తేజ ఆసక్తి..
- December 11, 2015
నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడికోటపై హీరో రామ్ చరణ్ తేజ ఆసక్తి చూపించారు. గడికోటలోని మహాదేవుని ఆలయంలో జరిగిన మహారుద్ర శత చండీ యాగంలో గురువారం సతీమణి ఉపాసనతో పాటు పాల్గొన్న ఆయన కోటలో అందాలను, కట్టడాలను తిలకించారు. వీటికి సంబంధించిన వివరాలను గైడ్ ను అడిగి తెలుసుకున్నారు. హీరో రాంచరణ్ తేజ కోటకు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెర్రీ.. చెర్రీ.. అని నినాదాలు చేశారు. ఈ సందర్భం గా అభిమానులకు హీరో హాయ్ అంటూ పలకరించారు. పోలీసులు, ప్రైవేటు సిబ్బంది బందోబస్తు చేపట్టారు. ఉమాపతి రావు, అనిల్, రాంచరణ్ తేజ 16 సైకిల్ రిక్షాలను పంపిణీ చేశారు. దోమకొండ గ్రామంలోని 16 వార్డుల్లో రోడ్లు శుభ్రంగా ఉంచేందుకు వీటిని అందజేసినట్లు రామ్ చరణ్ తేజ చెప్పారు. గతంలో ఆటో ట్రాలీ రిక్షాను మామయ్య కామినేని అనిల్ సహకారంతో అందించామని చెప్పారు. కోటలో భవనాలకు మరమ్మతు పనులు పూర్తి అ య్యాయని సిబ్బంది తెలిపారు. రెండు నెలలు తర్వాత భవనాలను హీరో రాంచరణ్ తిరిగి ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో రాంచరణ్ తేజను దోమకొండ గ్రామస్తులు సన్మానిం చారు. గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, మాజీ సర్పంచి ఐరేని నర్సయ్య, అనంతరెడ్డి, నల్ల పు శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, సాయబుగారి రాజు మధుసూదన్‌రెడ్డి, షమ్మీ, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







