భారీ బందోబస్తు నడుమ అమర్నాధ్ యాత్ర
- June 27, 2018
కట్టుదిట్టమైన బందోబస్తుమధ్య అమర్నాధ్ యాత్రకు జమ్మునుంచి యాత్రీకులు మొదటి బ్యాచ్‌గా ప్రయాణం అవుతున్నారు. మొత్తం 40వేలమందికిపైగా సెక్యూరిటీసిబ్బంది జమ్ముకాశ్మీర్పోలీసులు, పారామిలిటరీ, జాటీయ ఉపద్రవ నివారణ సిబ్బంది,సైన్యం వంటి వారు ఈసారి అమర్నాధ్ యాత్రకు అనుగుణంగా బందోబస్తునిర్వహిస్తున్నారు. మొదటిబ్యాచ్ బుధవారం జమ్మునుంచి బయలుదేరుతుంది. జమ్ములోని భగవటినగర్బేస్క్యాంప్నుంచి మొదటిబ్యాచ్ బయలుదేరుతుంది. ఈ యాత్ర వచ్చేనెల 26వ తేదీతో ముగుస్తుంది. ఆరోజే రక్షాబంధన్సైతం వస్తోంది. పర్యాటకుల్లో సాధువులుకూడా ఉన్నారు. ఇప్పటికే దేశంలోని విభిన్న ప్రాంతాలనుంచి సాధవులు వస్తున్నారు. బల్టాల్, ఫహల్గామ్వద్ద ఉన్న బేస్క్యాంప్లనుంచి వీరు పయనం అవుతారు. అక్కడినుంచి బయలుదేరి బల్టాల్, నున్వాన్ పహల్గామ్ జిల్లాలకు వస్తుంటారు. గత ఏడాది అమర్నాధ్కు 2.60 లక్షలమంది యాత్రీకులు వచ్చారు. యాత్ర ప్రారంభం సందర్భంగా భద్రతను మరింతపెంచారు.లంగన్బాల్వంతెన వద్ద మొదటి సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను ఏర్పాటుచేసారు. ఆ తర్వాత నన్వాన్ బేస్క్యాప్వద్ద హైటెక్ గాడ్జెట్లతోకూడిన సెక్యూరిటీ చెక్ ఉంటుంది.
సిసిటివి కెమేరాలు, మెటల్ డిటెక్టర్లు, ఎక్స్‌రే యంత్రాలు వంటివి ఏర్పాటుచేసారు. స్మగ్లింగ్, నిషేధిత ఉత్పత్తులు తీసుకెళ్లేవీలులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేసారు. మొదటిసారి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్‌లను సైతం ఏర్పాటుచేసారు. అమరావతికి వెళ్లే వాహనాలన్నింటికీ ఏర్పాటుచేసారు.
సిఆర్పిఎఫ్ మోటార్‌సైకిల్ స్క్వాడ్లుసైతం రంగంలోనికి దిగాయి. వీటితపాటు తాత్కాలికప్రీపెయిడ్ మొబైల్కనెక్షన్లకుసైతం అనుమతిచ్చారు. ఏడునుంచి పదిరోజులకు వీటి కాలపరిమితిని పొడిగించారు. మొదటిసారి అమర్నాధ్యాత్రకు టెక్నాలజీని వినియోగిస్తున్నట్లుఐజి ఎస్డిసింగ్ జామ్వాల్ వెల్లడించారు. జమ్ముకాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆర్మీచీఫ్ బిపిన్రావత్లు అమర్నాధ్యాత్ర శిబిరాలవద్ద సెక్యూరిటీని సమీక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







