50 రోజులు పూర్తి చేసుకున్న 'మహానటి'
- June 27, 2018
ఏంటీ సావిత్రి బయోపిక్..నిజమా అసలు ఆమె జీవితం గురించి ఏం తెలుసూ..కుర్ర దర్శకుడు పెద్ద సాహసం చేస్తున్నాడు. అయినా నటీనటులకు సంబంధించి బయోపిక్ తీయడం అనేది పెద్ద సాహస నిర్ణయం అంటూ ఎన్నో అవరోదాలు సృష్టించారు..భయపెట్టారు. కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ..నాగ్ అశ్విన్ సావిత్రి జీవితక కథ ఆధారంగా 'మహానటి' తెరకెక్కించారు. ఆ చిత్రం చూసిన తర్వాత అందరూ షాక్ తిన్నారు..మహానటి పాత్రలో కీర్తి సురేష్ నటించింది అనేకన్నా జీవించారు అని చెప్పొచ్చు.
సావిత్రి ఇండస్ట్రీకి ఎలా వచ్చింది..ప్రేమ, పెళ్లి, పిల్లలు..మత్తుకు బానిస కావడం వీటన్నింటిని తనదైన స్టైల్లో చూపించారు దర్శకులు. ఇక మహానటి చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ కీర్తి సురేష్ నటనరకు ఫిదా అయ్యారు. ఈ చిత్రం తెలుగు , తమిళ ఇండస్ట్రీలో విజయవిహారం చేసింది. భారీ వసూళ్లతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అలాంటి ఈ సినిమా తాజాగా 50 రోజులను పూర్తిచేసుకుంది.
కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాకి ఈ స్థాయి విజయం లభించడం నిజంగానే గొప్ప విషయం. సావిత్రికి గల క్రేజ్.. ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి థియేటర్లకు రప్పించింది. అలాగే సీనియర్ ఆర్టిస్టుల కారణంగా చేకూరిన బలం ఈ సినిమా విజయంలో తమవంతు పాత్రను పోషించాయి. ముఖ్యంగా సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేశ్ ను ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో అగ్రస్థానంలో నిలబెట్టేసింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







