పోలీసుల అదుపులో హీరో జై

- June 28, 2018 , by Maagulf
పోలీసుల అదుపులో హీరో జై

ఒకటికాదు రెండు ముచ్చటగా మూడోసారి పోలీసులకు చిక్కారు కోలీవుడ్ నటుడు జై.. 2014 లో  కేకే.నగర్‌లోని కాశి థియేటర్‌ ప్రాంతంలో పూటుగా  మద్యం సేవించి ట్రాఫిక్‌ పోలీస్‌ వాహనాన్నే ఢికొట్టిట్టిన కేసులో నాలుగు రోజుల శిక్ష అనుభవించాడు. ఆ తరువాత  2017 సెప్టెంబరు 21న మళ్ళీ మద్యం సేవించి వేగంగా కారు నడుపుతూ  బ్రిడ్జ్‌  గొడను ఢీకొట్టాడు. ఈ కేసులో పోలీసులు అతనికి జరిమానా విధించి 6 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను రద్దు చేశారు.. తాజాగా  'జై'  మరోసారి  పోలీసుల అదుపులో ఉన్నారు. మంగళవారం రాత్రి నుంగంబాక్కమ్‌ ప్రధానరోడ్డులో విపరీతధ్వనితో సైరన్‌ మోగించుకుంటూ వెళ్లడంతో ఇతర వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు 'జై' కారును వెంబడించి అడ్డుకున్నారు. ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నారు. 'జై' ని అదుపులోకి తీసుకుని ధ్వని కాలుష్యం వలన వచ్చే అనర్ధాల గురించి అవగాహన వీడియోలను అతనికి చూపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com