ఎన్డీఆర్ బయోపిక్ పై మరో వివాదం... నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబం..
- June 28, 2018
ఎన్డీఆర్ బయోపిక్ పై మరో వివాదం ముసురుకుంది. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబం సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సినిమా దర్శకుడు క్రిష్, నటుడు బాలకృష్ణకు నోటీసులు పంపింది. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించి ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించే సమయంలో నాదేండ్ల ఎన్డీఆర్ స్నేహితులు. కానీ, అప్పటి పరిస్థితుల ప్రభావంతో ఇద్దరి మధ్య స్నేహం చెడింది. నాదెండ్ల ఎన్టీఆర్ కు షాకిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ బయో పిక్ లో ఈ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, నాదెండ్లను నెగటీవ్ గా చూపించబోతున్నారన్నది భాస్కర్రావు పెద్ద కుమారిడి ప్రధాన అభ్యంతరం.
నందమూరి తారక రామరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో బాలకృష్ణ ఎన్డీఆర్ రోల్ పోషిస్తున్నారు. మార్చి 29న సినిమా ఓపెనింగ్ అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. రామకృష్ణ స్టూడియోస్ జరిగిన తొలి సన్నివేశానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు క్లాప్ కొట్టారు. మొదట్లో సినిమా దర్శకుడిగా తేజకు అవకాశం దక్కినా..ఆ కొద్ది రోజులకే తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తాను ఎన్టీఆర్ సినిమా తీయలేనంటూ సైడైపోయాడు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను క్రిష్ కు అప్పగించారు. సినిమా రిలీజ్కు కూడా స్పెషల్ డేట్ను ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావాల్సివుంది.

తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!