అమెరికాలో భారత సంతతి చట్టసభ ప్రతినిధి అరెస్ట్
- June 29, 2018
భారతీయ సంతతికి చెందిన అమెరికా చట్టసభ ప్రతినిధి ప్రమీలా జయపాల్‌ను అరెస్టు చేశారు. ట్రంప్ సర్కార్ చేపట్టిన వలస విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో 500 మంది మహిళలతో కలిసి గురువారం క్యాపిటల్ హిల్ ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు ప్రమీలాతో పాటు మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అమెరికా చట్టసభకు ఎన్నికైన మొదటి భారతీయ సంతతి మహిళ ఆమె కావడం విశేషం. అక్రమంగా దేశంలోకి వలస వస్తున్న కుటుంబాలను అమెరికా విడదీస్తున్న విషయం తెలిసిందే. అందులో భారతీయ కుటుంబాలను కూడా విడదీశారు. ఈ విధానాన్ని నిరసిస్తూ ప్రమీలా వాషింగ్టన్లో ర్యాలీ నిర్వహించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







