భారతీయలను స్వదేశానికి పంపడానికి అండగా నిలిచిన ETCA

- June 29, 2018 , by Maagulf

యు.ఏ.ఈ: ఆరుగురి భారతీయ  ఖైదీల టికెట్స్ కోసం అయ్యే ఖర్చును  7200/- ధర్మస్ (రూపాయలు సుమారు లక్ష ముప్పై వేల) విరాళాన్ని సజ్జా పోలీస్ అధికారుల ద్వార బాధితులకు అందచేసి మానవత హృదయాన్ని చాటుకున్న - ETCA అద్యక్ష్యుడు రాధారపు సత్యం.

షార్జా లోని సజ్జా సబ్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు  క్రిష్ణ కుమార్ భాగవత్ (29) ఆదిలాబాద్ , మాదెళ్ల ఆంజనేయులు (30) నిజామాబాద్ జిల్లావారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు  ఏడుకొండలు నార్ని (30) ఈస్ట్ గోదావరి జిల్లా , దంగేటి శ్రీను (36) , నాదెళ్ల రాజేష్ (24) వెస్ట్ గోదావరి జిల్లా, పంజాబ్ రాష్ట్రానికి చెందిన గురుపీత్ సింగ్ (24) జలంధర్ జిల్లా  వివరాలు తెలుసుకొన్న ETCA సభ్యులు , జైలు అధికారులతో మాట్లాడి వారు స్వదేశానికి పంపడానికి కావాల్సిన సంబంధిత ప్రక్రియను పోలీస్ అధికారుల సహాయంతో పూర్తి చేసి వారిని జూలై మూడవ తేదీన ఇండియా వెళ్ళడానికి కావాల్సిన  టికెట్స్  సమకూరుస్తామని తెలిపి 28/06/2018 రోజున సబ్ జైలు ను సందర్శించి వారికి టికెట్స్ కు కావాల్సిన మొత్తాన్ని అందచేసి జూలై మూడవ తేదీనాడు స్వస్థలాలకు చేరేలా కృషి చేయడం జరిగింది .  

మానవత దృకపదం తో ఆర్ధిక సహాయాన్ని అందించిన ETCA అధ్యక్ష్యుడు రాధారపు సత్యంను ,జైలు అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రక్రియ వేగవంతం అయ్యేలా కృషిచేసిన ఆకునూరి శంకర్ గార్లను  ETCA  వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్ మరియు సంఘ సభ్యులు అభినందించారు . సంతోషంతో ఆరుగురు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాధారపు సత్యం పోలీస్  అధికారులతో మాట్లాడుతూ భవిష్యత్ లో కూడ సమాచారాన్ని అందిస్తే సంఘ సభ్యుల  సహాయంతో మరి కొంత మంది ఖైదీలకు కావలసిన టికెట్స్ కోసం సహాయం అందచేస్తామని తెలిపారు .

మానవత దృకపదం తో ఆర్ధిక సహాయాన్ని అందించిన ETCA అధ్యక్ష్యుడు రాధారపు సత్యంను ,జైలు అధికారులతో సంప్రదింపులు జరిపి ప్రక్రియ వేగవంతం అయ్యేలా కృషిచేసిన ఆకునూరి శంకర్ ను  ETCA  వ్యవస్థాపకులు పీచర కిరణ్ కుమార్ మరియు సంఘ సభ్యులు అభినందించారు . సంతోషంతో ఆరుగురు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు .

యూఏఈ ప్రభుత్వం ఆగష్టు 1 నుండి అక్టోబర్ 31, 2018 వరకు  ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాబిక్ష) ప్రక్రియలో భాగంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబందించిన వారు స్వదేశానికి వెళ్ళడానికి ఆర్ధిక మరియు ఏ ఇతర  ఇబ్బందులు ఏర్పడిన  ETCA ను సంప్రదించాలని చేతనైనంత సహాయాన్ని టికెట్స్ రూపంలో అందచేస్తామని,  జూలై 1 నుండి 31 వరకు ఛారిటీ టీమ్స్ మూడు బృంధాలుగా ఏర్పడి బాధితుల జాబితాను తయారు చేసి సంఘం ద్వార  మరియు దాతల సహాయంతో  వీలైనంత మందిని స్వదేశానికి చేరేలా కృషిచేస్తామని, 2012 ఆమ్నెస్టీ నుండి నేటి వరకు 156 మంది బాధితులకు టికెట్స్ ఇచ్చి ఆదుకున్నామని , 2018 ఆమ్నెస్టీ లో సైతం వీలైనంత మందిని స్వదేశానికి చేర్చేలా ETCA నూతన కార్యవర్గం పనిచేస్తుందని అధ్యక్ష్యుడు సత్యం సభ్యులతో కలిసి జైళ్లను సందర్శించి జాబితాను తయారు చేస్తున్నారని  సంఘ  వ్యవస్థాపకులు  పీచర కిరణ్ కుమార్  తెలిపారు .     


బాధితులు సంప్రదించవల్సిన నంబర్స్ & ఇమెయిల్ 
056 7672657 - డాక్టర్ పవన్ కుమార్ 
050 9580209 - నరేష్ కుమార్ మాన్యం  
052 6168898 - షేక్ అహ్మద్ (దుబాయ్)
050 1189338 - రవి కదంబా (దుబాయ్) 
050 4276335 - వేణు గొల్లపల్లి (షార్జా)
055 5755456 - శ్యామ్ గౌడ్ (అబుదాబి) 
056 9627881 - రాజ శేఖర్ తోట (అజ్మాన్)
050 6263927 - శ్రీనివాస్ ఎలిగేటి - (ఉమ్ ఆల్ కోయిన్)
052 7035434 - రాకేష్ రోషన్ (రసల్ ఖైమా)

ఈమెయిల్: etcauae [email protected] లేదా [email protected] 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఎన్నారైల సంక్షేమానికి ప్రకటించిన 50 కోట్ల నిధులు , ప్రభుత్వం  గల్ఫ్ లో నివసిస్తున్న కార్మికుల  సంక్షేమానికి చేపట్టబోయే చర్యల ప్రక్రియపై   యుద్ధ ప్రాతిపదికన ప్రకటన చేయాలని, యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన  ఆమ్నెస్టీ లో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేయాలని , ఎన్నారై మినిస్టర్ కేటీర్ యూఏఈ  మరియు గల్ఫ్ దేశాలలో  పర్యటించి కార్మికులకు భరోసా కల్పించి త్వరితగతిన ముఖ్యమంత్రి చే ప్రకటన చేయించాలని కార్యవర్గ సభ్యులు  డిమాండ్ చేశారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com