అబుదాబి షూటింగ్ ముగించుకున్న సాహో టీమ్

- June 30, 2018 , by Maagulf
అబుదాబి షూటింగ్ ముగించుకున్న సాహో టీమ్

బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్‌డం సంపాదించిన హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో . ఈ సినిమాపై తెలుగులోనే కాదు హిందీలోను భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రన్ రాజా ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యూవీ క్రియేషన్స్ బేనర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ అబుదాబీలో జరుగుతూ వస్తుంది. ఈ షెడ్యూల్‌లో అత్యంత క్లిష్టమైన సన్నివేశాలు, యాక్షన్ సీన్స్‌, చేజింగ్ ఫైట్స్ 90 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కించారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ రూపొందించినట్టు సమాచారం. తాజాగా అబుదాబి షెడ్యూల్ ముగియడంతో జూలై 11 నుండి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ మొదలు పెట్టునున్నారు. ఇందులో ప్రముఖ తారాగణం పాల్గొనున్నారు. సాహో ఒక నవల తరహాలో కొనసాగే యాక్షన్ డ్రామా కాగా ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ , జాక్ ష్రాఫ్ , చుంకీ పాండే,అరుణ్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం హిందీ థియేట్రికల్ రైట్స్‌ని టీ సిరీస్ భూషన్ 120 కోట్లకి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com