నేటి నుంచి ముక్కోణపు టీ20 టోర్నీ
- June 30, 2018
ఆదివారం నుంచి జింబాబ్వే రాజధాని హరారేలో ముక్కోణపు టీ20 టోర్ని ప్రారంభం కానుంది. ఈ టోర్నిలో ఆతిధ్య జింబాబ్వేతో పాటు, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు పాల్గొంటున్నాయి. ఐసిసి ప్రస్తుత టీ20 ర్యాకింగ్స్లో పాకిస్తాన్ నంబర్‌వన్ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. గతంలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఓటమితో మూడో స్థానానికి దిగజారింది. అయితే ఈ జింబాబ్వే సిరీస్‌లో రాణిస్తే ఆస్ట్రేలియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఈ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తే టాప్ప్లేస్కు వెళ్లే అవకాశం టీమిండియాకు కూడా ఉంది. కాగా, మరోవైపు జింబాబ్వే జట్టు ఐసిసి టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కూడా లేదు. ఈ సిరీస్‌లో రాణించి ర్యాకింగ్‌ల జాబితాలోకి ప్రవేశించాలని జింబాబ్వే పట్టుదలగా ఉంది. ఈ టోర్నిలో తొలి మ్యాచ్‌లో ఆదివారం జింబాబ్వే, పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మూడు జట్లు రెండు సార్లు ఒకొక్క జట్టుతో తలపడతాయి.చివరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. జులై 8న ఫైనల్ జరుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







