విజయ్ దేవరకొండ కొత్త సినిమాకి ముహూర్తం ఫిక్స్
- July 01, 2018
యంగ్ అండ్ డైనమైట్ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రం ఇచ్చిన జోష్‌తో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటించిన టాక్సీవాలా చిత్రం విడుదలకి సిద్ధం కాగా, ప్రస్తుతం బైలింగ్యువల్ మూవీ నోటా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరశురాం తెరకెక్కిస్తున్న గీతా గోవిందం సినిమా చేస్తున్నాడు . ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట . ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడితో కూడా ఓ సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ సిద్ధమైన సంగతి తెలిసిందే . మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి డియర్ కామ్రేడ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా, ఇందులో కాకినాడ యాసలో మాట్లాడి అలరించనున్నాడు విజయ్. చిత్రంలో కొత్త అమ్మాయిని కథానాయికగా తీసుకోనున్నారు. ఈ మూవీ రేపు ఉదయం 10గం.లకి గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ని విడుదల చేసి విషయాన్ని తెలియజేశారు చిత్ర నిర్మాతలు. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకి సంబంధించిన టాలెంట్ వ్యక్తులని మాత్రమే డియర్ కామ్రేడ్ చిత్రం కోసం ఎంపిక చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించగా, ఇటీవల కాకినాడలో ఆడిషన్స్ కూడా నిర్వహించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







