మహేష్ బాబు 25 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.!

- July 01, 2018 , by Maagulf
మహేష్ బాబు 25 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన కెరీర్లో సిల్వర్ జూబ్లీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ డెహ్రడూన్‌ జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ డేట్ ఖరారైనట్లు సమాచారం. వచ్చే సమ్మర్ సీజన్లో 2019 ఏప్రిల్ 5న విడుదల చేస్తే మంచి ఫలితాలు వస్తాయనే ఆలచనలో ఉన్నారట. ఈ విషయాన్ని ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. మహేష్ బాబు కెరీర్లో ఇండస్ట్రీ హిట్ చిత్రాలైన భరత్ అనే నేను, పోకిరి ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యాయి.

ఇందులో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంటుగా కనిపించబోతున్నారు. కథాంశం రైతుల సమస్యలను టచ్ చేస్తుందని, అన్నదాతల ఇబ్బందులు ఇందులో ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో పాటు మంచి వినోదాత్మక అంశాలను జోడించి దర్శకుడు వంశీ పైడిపల్లి స్కిప్టు తయారు చేసుకున్నారట.

శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ మరియు వైజయంతీ మూవీస్‌ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కథ: వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్‌, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, నిర్మాతలు: సి.అశ్వనీదత్‌, దిల్‌రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com