ఒకే ఇంట్లో 11 మంది చనిపోవడానికి వెనుక విస్తుపోయే రహస్యం..
- July 02, 2018
ఢిల్లీలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్యపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న విషయంపై పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. కానీ వాస్తవంగా నారాయణ్ దేవ్ కుటుంబానికి విపరీతమైన భక్తి భావం ఉంది. దీనికితోడు మూఢవిశ్వాసాలను అపారంగా నమ్ముతారు. ఇందుకు కారణం గతంలో జరిగిన ఓ సంఘటనే అని తెలుస్తోంది.
వృత్తిరీత్యా బురారీ కుటుంబం కలప వ్యాపారం నిర్వహించేది. పదిహేనేళ్ల కిందట ఆ ఇంటి పెద్దకు ప్రమాదవశాత్తు చెక్క మీదపడటంతో ఆయన తన మాటను కోల్పోయాడు. అయితే కొద్దిరోజులకు ఎవరో చెబితే పూజలు చేశారు. దీంతో అతనికి తిరిగి మాట వచ్చిందని గతంలో ఆ ఇంట్లో పనిచేసిన మహిళ వెల్లడించింది. అలా వారి ఇంట్లో భక్తిభావం ఎక్కువైంది. ఈ క్రమంలోనే కొందరు స్వామీజీలతో కలిసి తాంత్రికపూజలు చేసేవారు. పైగా పునర్జన్మలను బలంగా నమ్మేవారని స్థానికులు చెబుతున్నారు.
ఆ కుటుంబానికి తాంత్రికపూజలు అలవాటు కావడంతో కొద్ది రోజులకే పరిస్థితి శృతిమించింది. చివరకు మోక్షం కావాలి అనే కోరికను పుట్టించింది. అందుకే దానికోసం కుటుంబమంతా కలిసి సూసైడ్ చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!