కారులో కంత్రీలు.. టిక్‌టాక్‌గా వస్తారు..ఎవరికీ ఏ మాత్రం..

- July 02, 2018 , by Maagulf
కారులో కంత్రీలు.. టిక్‌టాక్‌గా వస్తారు..ఎవరికీ ఏ మాత్రం..

పగలు రెక్కీ... రాత్రి దొంగతనం. నిన్న మొన్నటి దాకా ఇదీ దొంగల తీరు. కానీ దొంగలు రూటు మార్చారు. రెక్కీ, దోపిడీ అన్నీ ఒకేసారి ముగించేస్తున్నారు. తాళం వేసివున్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. పట్టపగలే దర్జాగా దోచేస్తున్నారు. మూడు రోజుల్లో ఎనిమిది ఇళ్లను గుల్ల చేశారు. సిటీ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కంత్రీలు... పోలీసులకు సవాల్ విసురుతున్నారు.

పట్టపగలు దొంగల దర్జాగా కారులో వస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. అదనుచూసి ఇంట్లోకి దూరిపోతారు....
టిక్‌టాక్‌గా వస్తారు. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడతారు. ఈ కంత్రీలు కారులో వస్తారు. దీంతో ఎవరికీ వీళ్లపై డౌట్ రాదు. ఇంటి యజమానులే అనుకుంటారు. కానీ వీళ్లు మాత్రం గోడదూకి ఇంట్లోకి వెళ్తారు. డూప్లికేట్ కీస్‌తో తాళం తీసి ఉన్నదంతా దోచేస్తారు....

ఇలాంటి దొంగతనాలు హైదరాబాద్‌ సిటీలో ఈ మధ్య ఎక్కువయ్యాయి. మూడు రోజుల్లోనే ఎనిమిది దొంగతనాలు జరగడం నగర వాసులను భయపెడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఎనిమిది ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఇదంతా ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సీసీ టీవీ కెమెరాలు వీళ్ల ప్రతి కదలికను కనిపెడుతూనే ఉన్నాయి....ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా... చోరీలు చేయడంలో దిట్ట. చాలా స్టైలిష్‌గా ఉండే ఈ ముఠా సభ్యుల మెడలో బ్యాగు ఉంటుంది. తాళాలు తెరిచే వస్తువులన్నీ అందులో రెడీగా ఉంటాయి. యాక్షన్ మొదలు పెట్టి మూడు నిమిషాల్లోనే దోచేయడం ఈ ముఠా ప్రత్యేకత. పనిపూర్తికాగానే అక్కడి నుంచి చల్లగా కారులో జారుకుంటారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా హైవే పైకి వెళ్లి పారిపోతారు. ఈ ముఠాకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కంత్రీల కోసం గాలిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com