భారీ గుహలో 13 మంది.. నాలుగు నెలలపాటు..
- July 06, 2018
థాయ్‌లాండ్‌లోని ఓ భారీ గుహలో 12 మంది బాలురతో పాటు పుట్‌బాల్ కోచ్ చిక్కుకుపోయారు. వీరిని బయటకు తీసుకు వచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మెక్సికోలో 69 రోజుల పాటు భూగర్భంలోనే గడిపిన మారియో సెపుల్వేదా అంటున్నారు. వీరిని బయటకు తీసుకురావడానికి మూడు అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు.
* గుహలో ఉన్న దారిలో నీటిలో ఈదుకుంటూ బయటపడటం
* గుహ పై నుంచి రంధ్రం చేసి చిక్కుకొన్న వారిని కాపాడే ప్రయత్నం చేయడం
* వర్షాలు తగ్గే వరకు వేచి చూడడం
మరోవైపు గుహలో చిక్కుకొన్న వారిలో ఎవరికీ కూడ ఈత రాదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై సర్కార్ దృష్టి పెట్టింది. లోపల ఉన్న 13 మందికి నాలుగు నెలలపాటు సరిపోయేలా గుహలోకి ఆహార పదార్థాలు పంపించడానికి ప్రయత్నిస్తున్నామని థాయ్ నౌకాదళం ప్రకటించింది. గుహలోకి మరిన్ని నీళ్లు చేరే అవకాశం ఉండటంతో లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా సహాయక బృందాలు చర్యలు తీసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..