'సవ్యసాచి' ని వెనక్కి నెట్టిన నాగ్
- July 07, 2018
ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్ లో 'సవ్యసాచి' అనే ఒక సినిమా, ఇంకోటి మారుతీ డైరెక్షన్ 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే రిలీజ్ అవుతున్నాయి అని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం 'సవ్యసాచి' విడుదల వాయిదా పడినట్లుగా సమాచారం వస్తుంది. గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆగష్టు రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు చిత్ర నిర్మాతలు. అదే నెల 31న చైతు ఇంకో సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా రిలీజ్ ఉండటంతో..'సవ్యసాచి' ని వాయిదా వేయమని కోరారట నాగార్జున. అందుకు ఆ చిత్ర సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి సెప్టెంబర్ లో నాగ్, నానిలు నటిస్తున్న'దేవదాస్ 'చిత్రం ఉంది. సెప్టెంబర్ విడుదలకు నాగ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
సో ఈ సినిమాపై క్లారిటీ వస్తే 'సవ్యసాచి' పై క్లారిటీ వస్తుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







