బహ్రెయిన్ :పోలీసులకు సహకరించిన డ్రగ్ సెల్లర్
- July 07, 2018
ఆసియాకి చెందిన వ్యక్తి నిషేధిత డ్రగ్ మరిజువానాను విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో అతనికి 10 నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడాల్సి వుంది. అయితే, నిందితుడు పోలీసులకు విచారణలో సహకరించి, డ్రగ్స్ డీలర్స్‌ని పట్టుకోవడంలో సాయపడినందున హై క్రిమినల్ కోర్ట్ అతనికి ఏడాది జైలు శిక్షను మాత్రమే విధించింది. డ్రగ్స్‌ని కేవలం తాను సేవించేందుకే కొనుగోలు చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు నిందితుడు. ఇదిలా ఉండగా, ఈ కేసులో నలుగురికి ఏడాది నుంచి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష విధించగా, అందులో ఒకరికి 10,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా కూడా ఖరారు చేశారు. నిందితుల్ని జైల్ టెర్మ్ ముగిశాక దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!