రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బహ్రెయినీల మృతి

- July 07, 2018 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బహ్రెయినీల మృతి

బహ్రెయిన్:షేక్‌ ఇసా బిన్‌ సల్మాన్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బహ్రెయినీలు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తోన్న కారు, అతి వేగంగా దూసుకెళ్ళి సిమెంట్‌ బ్యారియర్‌ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ మహిళ, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంతో ప్రమాదానికి గురైన వాహనం మరో రెండు వాహనాల్ని డీకొనగా అందులోనివారికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com