రూ.1,212లకే విమాన ప్రయాణం.. ఏడాదిలో ఎప్పుడైనా..
- July 11, 2018
విమాన ప్రయాణం చేయాలనుకున్న మధ్యతరగతి వ్యక్తుల కల నిజం చేస్తున్నాయి కొన్ని విమాన యాన సంస్థలు. తాజాగా రూ.1,212కే టిక్కెట్ ఆఫర్ చేస్తోంది ఇండిగో. తమ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా 12 లక్షల టిక్కెట్లను రాయితీ ధరపై విక్రయించనుంది. జులై 10 నుంచి ప్రారంభమైన టిక్కెట్ల విక్రయం జులై 25తో ముగుస్తుంది. 2019 మార్చి 30 వరకు ఎప్పుడైనా ఈ టిక్కెట్ ద్వారా ప్రయాణించొచ్చు. తమ నెట్ వర్క్ పరిధిలోని అన్ని మార్గాలకు ఈ టిక్కెట్ వర్తిస్తుందన్నారు. తమ సంస్థ వెబ్సైట్లో ఇందుకు సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచారు. ఎస్బీఐ కార్డు ద్వారా పేమెంట్ జరిపే బుకింగ్స్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. అయితే కనీసంగా రూ.3000 ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..