విశాఖపట్నం-కౌలాలంపూర్ 3,399కే టికెట్
- July 11, 2018
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల కోసం మలేషియాకు చెందిన ఎయిర్‌ఏషియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా తగ్గింపు ధరల్లో 30 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచినట్లు ఎయిర్‌ఏషియా ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నం-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,399గా, కొచ్చి-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.3,699గా ఉంటుందని పేర్కొంది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్ వారం రోజులు ఉంటుందని, ఈ ఆఫర్‌లో టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వ చ్చే ఏడాది మే 31 వరకు ఎప్పుడైన ప్రయాణించవచ్చని తెలిపింది.
కోల్‌కతా-కౌలాలంపూర్, బెంగుళూరు-కౌలాలంపూర్ టికెట్ ధర రూ.6,999గా, తిరుచ్చి-హైదరాబాద్ టికెట్ ధర రూ.4,699గా ఉంటుందని పేర్కొంది. అలాగే బెంగుళూరు-కొచ్చి, బెంగుళూరు-గోవా, బెంగుళూరు-జైపూర్, బెంగుళూరు-చండీగఢ్ వంటి దేశీ విమాన టికెట్ ధరలు వరుసగా రూ.1,390,రూ.1,690, రూ.3,290, రూ.3,490గా ఉంటాయని ఎయిర్‌ఏషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు చాండిల ్య తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







