వ్యాట్‌పై కొత్త రూల్ ప్రకటించిన యు.ఏ.ఈ
- July 11, 2018
యు.ఏ.ఈ:వాల్యూ యాడెడ్ ట్యాక్స్‌కి సంబంధించి రిఫండ్ సిస్టమ్‌ని పర్యాటకుల కోసం తీసుకొస్తున్నారు. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. టూరిజం సెక్టార్ అభివృద్ధి కోసం కొత్త ట్యాక్స్ రిఫండ్ సిస్టమ్‌ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018 ఫోర్ట్ క్వార్టర్లో ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇంటర్నేషనల్ స్పెషలైజ్డ్ కంపెనీ - ట్యాక్స్ రికవరీ సర్వీసెస్ సహకారంతో దీన్ని అమలు చేస్తారు. నాన్ రెసిడెంట్ టూరిస్ట్‌లు వ్యాట్ని రిఫండ్ పొందేందుకు ఈ విధానం అనుమతిస్తుంది. అయితే కొనుగోళ్ళ ద్వారా మాత్రమే దీన్ని రిఫండ్ పొందవచ్చు. లోకల్ ఎకానమీకి డైరెక్ట్‌గా టూరిజం సెక్టార్ ఉపకరిస్తుంది. యూఏఈ ఎయిర్‌పోర్ట్స్ ద్వారా 2017లో మొత్తం 123 మిలియన్ ప్రయాణీకులు ప్రయాణించారు. దేశ జీడీపీలో టూరిజం వాటా 11.3 శాతం. దీని విలువ మొత్తంగా 154.1 బిలియన్ దిర్హామ్‌లు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







