200,000 దిర్హామ్‌ల ప్రైజ్ మనీ: అంతా ఫేక్
- July 11, 2018
వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఫేక్ మెసేజ్‌ల ప్రచారానికి అడ్డుకట్ట పడటంలేదు. హైపర్ మార్కెట్స్, ప్రముఖ బ్రాండ్స్ పేరుతో భారీ బహుమతులంటూ ఫేక్ మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయి. 'లక్కీ డ్రా ప్రోమో 2018 పేరుతో కొత్తగా ఓ మెసేజ్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. లులు హైపర్ మార్కెట్, విజేతకు 200,000 దిర్హామ్‌లు అందజేస్తుందన్నది ఈ మెసేజ్ సారాంశం. అయితే ఇదంతా ఫేక్ వ్యవహారమని కొట్టి పారేశారు లులు హైపర్ మార్కెట్ నిర్వాహకులు. గతంలోనే లులు హైపర్ మార్కెట్ ఈ తరహా ఫేక్ మోసాలపై వినియోగదారుల్ని అప్రమత్తం చేసింది. విజేతలకు 200,000 దిర్హామ్‌లు అందజేయడం కోసం బ్యాంక్ డిటెయిల్స్ ఇవ్వాలంటూ స్కామర్లు ఒత్తిడి చేయడం, వారి ఒత్తిడికి తలొగ్గి బ్యాంక్ డిటెయిల్స్ ఇచ్చి అమాయకులు నిండా మునిగిపోవడం జరుగుతోంది. ఇలాంటి ఫేక్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా వుండాలనీ, సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని మంత్రిత్వ శాఖలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..