సిరియా సైన్యంపై ఇజ్రాయిల్‌ దాడి

- July 11, 2018 , by Maagulf
సిరియా సైన్యంపై ఇజ్రాయిల్‌ దాడి

సిరియా సైన్యంపై ఇజ్రాయిల్‌ దాడి డమాస్కస్‌: సిరియా సైనిక స్థావరాలపై ఇజ్రాయిల్‌ దళాలు క్షిపణి దాడి చేశాయి. ఈ విషయాన్ని సిరియా న్యూస్‌ ఎజెన్సీ సన ధ్రువీకరించింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఒక విమానం హదర్‌, జుబా పట్టణ శివార్లలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పలు క్షిపణులను ప్రయోగించింది. ముంచుకొస్తున్న ముప్పును సిరియా ఎయర్‌ డిఫెన్స్‌ గుర్తించి కొన్నిటిని మార్గమధ్యలోనే కూల్చేసింది. మరికొన్ని లక్ష్యాలను తాకాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అంతకు మందు ఒక సిరియా డ్రోన్‌ ఒకటి ఇజ్రాయిల్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీనిని ఇజ్రాయిల్‌ దళాలు కూల్చివేశాయి. ఈ వీడియో ఫుటేజీని కూడా ఇజ్రాయిల్‌ దళాలు విడుదల చేశాయి. అనంతరం ఇజ్రాయిల్‌ దళాలు సిరియాపై క్షిపణి దాడులకు దిగాయి. ఇజ్రాయిల్ ప్రధాని బుధవారం ఓ కీలక అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వివరణ ఇచ్చారు. సిరియాలో అసద్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. కానీ సిరియా నుంచి ఇరాన్‌ దళాలు మాత్రం వెనక్కి వెళ్లిపోవాలని ఆయన కోరారు.

మీడియా నిర్బంధం.. సిరియాలోని ఖ్యునెత్రా, దరా ప్రాంతంలో దాదాపు 70 మంది మీడియా ప్రతినిధులు చిక్కుకు పోయినట్లు కమిటీ ఆఫ్‌ ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్‌ ప్రకటించింది. ఇజ్రాయిల్‌, జోర్డాన్‌ సరిహద్దులను మూసివేడయంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com