క్రిస్మస్ కానుకగా రాబోతున్న అంతరిక్షం
- July 12, 2018
వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పేస్ కాన్సెప్ట్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంకల్ప్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అంతరిక్షం అనే టైటిల్ అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీకి విడుదల తేదీ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ఈ సినిమాలో ఉన్నారు. వీళ్లలో లావణ్యకు వరుణ్ సరసన నటించిన అనుభవం ఉంది. అదితి-వరుణ్ తేజ్ కాంబినేషన్ మాత్రం ఫ్రెష్. ఫస్ట్ ఫ్రేమ్ ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగులో మొట్టమొదటి స్పేస్ మూవీ ఇది.
ఈ మూవీలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ జిబెక్, టోడోర్ లాజరవ్ (జూజి), రోమన్ వర్క్ చేస్తున్నారు. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ అధితి రావుపై ఇప్పటికే 3డి స్కాన్ చేశారు. సినిమాకు ఈ టెక్నాలజీ మరింత హెల్ప్ కానుంది. గతంలో ఈ స్టంట్ కొరియోగ్రాఫర్లు ఎక్స్ పాండబుల్స్-2, ట్రాయ్, జీరో డార్క్, హెర్కులస్, రీబార్న్, స్నిప్పెట్, మార్కో పోలో, గేమ్ అఫ్ త్రోన్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







