నేటి నుంచి జగన్నాథుని రథయాత్ర
- July 13, 2018
పూరి జగన్నాథుడి రథయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది... ప్రధాన దేవస్థానం పూరి శ్రీ మందిరంలో దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి. శుక్రవారం సాయంత్రం జగన్నాథుడి ఆలయం నుంచి ఆజ్ఞామాల రథ నిర్మాణ ప్రాంగణానికి చేరడంతో రథాలను మలుపుతిప్పారు. ప్రధాన దేవాలయం నుంచి మూలవిరాట్లను వరుస క్రమంలో రథాలపైకి తరలించడానికి వీలుగా ముందు రోజు రథాలను మలుపు తిప్పడం ఆచారం. నేటి నుంచి జరగనున్న రథయాత్ర ఉత్సవాల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో పూరికి చేరుకున్నారు. దర్శనం కోసం ఇప్పటికే భక్తులు బారులు తీరారు. 15 రోజుల అనసరగృహ వేడుక తర్వాత తొలిసారి దేవతామూర్తులు మళ్లీ కొలువు తీరాయి. జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలు ఈ వేడుక కోసం ధగధగలాడుతున్నాయి. రథయాత్ర సందర్భంగా పూరిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







