పాక్ లో ఎన్నికలు.. ఫేస్‌బుక్‌ సీఈఓ సంచలన నిర్ణయం..

- July 15, 2018 , by Maagulf
పాక్ లో ఎన్నికలు.. ఫేస్‌బుక్‌ సీఈఓ సంచలన నిర్ణయం..

త్వరలో పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సందర్బంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. శాశ్వతంగా పాకిస్థాన్ కు చెందిన పలు సంస్థల అకౌంట్లను బ్లాక్ చేస్తూ ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయం తీసుకున్నారు.ఆ.. అకౌంట్లు ఉగ్రవాద కార్యకలాపాలు కలిగి ఉన్నాయన్న అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయన తెలిపారు. ఫేస్‌బుక్‌ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్‌ సయ్యద్‌ స్థాపించిన జమత్‌-ఉద్‌-దావా, ఇస్లామిక్‌ మల్లీ ముస్లిం లీగ్ సంస్థలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. త్వరలో ఎన్నికలు జరుగనున్న భారత్‌, బ్రెజిల్‌, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తామని జూకర్‌బర్గ్‌ ప్రకటించారు. ఇదిలావుంటే గతంలో ఈ సంస్థలను బ్లాక్ చెయ్యాలని ఫేస్‌బుక్‌ ను కోరింది పాక్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే జుకర్ బర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు  తెలుస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com