సలామ్ ఎయిర్ కొత్త విమానాలు, కొత్త రూట్స్
- July 17, 2018
మస్కట్:ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్ లైన్ సలామ్ ఎయిర్, ఆరు కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లను, ఎయిర్ బస్ ఎ320 నియోను తన ఫ్లీట్‌లోకి చేర్చుకుంది. కొత్త ఎయిర్ క్రాఫ్ట్‌లు సలామ్ ఎయిర్ కోసం ప్రత్యేకించి రూపొందించబడ్డాయి. వీటిలో 180 సీట్లు వుంటాయి. ప్రస్తుతం వున్న సలాలా, ముల్తాన్, సియాల్‌కోట్, షిరాజ్‌లతోపాటు కొత్త రూట్‌లు కువైట్ సిటీ, రియాద్, ఖర్తౌమ్, ఈజిప్ట్, ఇరాక్, ఢాకా, ఖాట్మండు సహా ఇండియాలోని పలు నగరాలకు వీటిని వినియోగించనున్నారు. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ మాట్లాడుతూ, ఏవియేషన్ ఇండస్ట్రీ మిడిల్ ఈస్ట్‌లో చాలా వేగంగా విస్తరిస్తోందనీ, ఈ నేపథ్యంలోనే సలామ్ ఎయిర్ తన కార్యకలాపాల్ని మరింత విస్తరిస్తూ, ప్రయాణీకులకు మెరుగైన సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్