యు.ఏ.ఈ:ఈ ఉల్లంఘనకి పాల్పడితే 50,000 దిర్హామ్‌ల జరీమానా
- July 17, 2018
యు.ఏ.ఈ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, వాటర్ క్రాఫ్ట్ ఓనర్లకు సంబంధించి జరీమానా రిమైండర్‌ని జారీ చేసింది. జెట్ స్కీ ఇంజిన్ నెంబర్ల టాంపరింగ్కి పాల్పడితే 50,000 దిర్హామ్‌ల వరకు జరీమానా విధించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పేర్కొంది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే జెట్ స్కీ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు, దాన్ని స్వాధీనం చేసుకోవడమూ జరుగుతుంది. బీచ్‌కి 200 మీటర్ల లోపల జెట్ స్కీ వినియోగిస్తే జరీమానా తప్పదు. పర్సనల్ వాటర్ క్రాఫ్ట్స్‌కి సంబంధించిన నిబంధనల ప్రకారం మొదటి పెనాల్టీ 500 దిర్హామ్‌లు కాగా, రెండో పెనాల్టీకి 1000 దిర్హామ్‌లు చెల్లించాలి. మూడో పెనాల్టీకి 2000 దిర్హామ్‌ల జరీమానా విధించబడటమే కాకుండా వాహనాన్ని నెల రోజులపాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







