విమానం కూలే ముందు ప్రయాణికులు ఎలా ఉన్నారో...
- July 19, 2018
విమానం కూలే ముందు భయం ఎలా ఉంటుందో ఈ వీడియోలో కనిపిస్తుంది. వండర్‌బూమ్ ఎయిర్ పోర్టు నుంచి నెదర్లాండ్‌కు వెళుతున్న ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటన దక్షిణాఫ్రికా కేప్‌టౌన్ వద్ద జరిగింది.1954లో తయారు చేసిన విమానాన్ని నెదర్లాండ్‌లోని మ్యూజియంకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఫైలెట్, కో ఫైలెట్ సహా మొత్తం 19 ప్రయాణికులు అందులో ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒక ఇంజనీర్, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుంటే ప్రమాదానికి ముందు అందులోని వ్యక్తి విమాన రెక్కలను వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో రెక్కకు కొంచెం కొంచెంగా మంటలు వ్యాపించడం వీడియోలు స్పష్టంగా కనిపించింది. అయితే కొద్ది సేపటి తరువాత ఆ వీడియో ఆగిపోయింది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగిందని అర్ధమవుతుంది. ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలు, కాపాడండంటూ వారిలోని భయం స్పష్టంగా రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..