అఫ్ఘాన్లో తాలిబన్ల దాడి

- July 20, 2018 , by Maagulf
అఫ్ఘాన్లో తాలిబన్ల దాడి

కాబూల్‌ : అఫ్ఘనిస్థాన్‌లోని ఘజినీ ప్రావిన్స్‌లో తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఘజినీ ప్రావిన్స్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...ఖారబాగ్‌ జిల్లాలోని పోలీసు సెక్యూరిటీ పోస్టుపై తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 8 మంది పోలీసులు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. తాలిబన్ల దాడి నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com