19వ ఆసియా మెన్స్ యు20 వాలీబాల్ చాంపియన్‌షిప్
- July 21, 2018
మనామా: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వాలీబాల్ కాంపిటీషన్స్‌కి రంగం సిద్ధమయ్యింది. రిఫ్ఫా స్పోర్ట్స్ సిటీలో 19వ ఆసియా మెన్స్ అండర్ 20 చాంపియన్‌షిప్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 24 దేశాలు ఈ పోటీల్లో పాలుపంచుకుంటున్నాయి. వారం రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. ఆసియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (ఎడబ్ల్యుసి) ఈ పోటీల్ని నిర్హఇస్తోంది. బహ్రెయిన్ వాలీబాల్ అసోసియేషన్ సహాయ సహకారాలు అందిస్తోంది. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇదిలా వుంటే మనామాలోని గోల్డెన్ టులిప్ హోటల్లో జనరల్ టెక్నికల్ ప్రిపరేటరీ మీటింగ్ జరిగింది. టోర్నమెంట్‌కి చెందిన కంట్రోల్ కమిటీ ప్రెసిడెంట్ సయీద్ దరడేరాక్షండే, ఇంటర్నేషనల్ రిఫరీ ఛాంగ్ చిన్ జాంగ్, లోకల్ ఆగర్గనైజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెహాద్ ఖల్ఫాన్ మరియు పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







