కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా రాహుల్
- July 22, 2018
2019 ఎన్నికలకు రంగస్థలాన్ని సిద్ధం చేసుకుంటోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధి అని ప్రకటించింది. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు ఎళ్తామని క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీలో జరిగిన సీడబ్యూసీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికల వ్యూహాలపై నేతలు చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ప్రీ-అలయెన్స్, పోస్ట్-అలయెన్స్‌పై నిర్ణయాధికారాన్ని రాహుల్‌కే అప్పగిస్తూ సీడబ్యూసీ నిర్ణయించింది. రాష్ట్రల అవసరాలకు అనుగుణంగా పొత్తులను ఖరారు చేసుకోనుంది కాంగ్రెస్. పొత్తులపై స్పష్టతకు ఓ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాహుల్ ప్రకటించారు.
పార్టీలో క్రమశిక్షణపై కూడా సీడబ్ల్యూసీ నేతలు చర్చించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా తమ కార్యచరణ ఉండబోతుందని ప్రకటించిన కాంగ్రెస్...అందుకు తగిన కార్యచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. అయితే..పెద్ద లక్ష్యాల వైపు జరుగుతున్న పోరాటంలో ఎవరైనా తప్పుడు ప్రకటనలు చేసినా..భాషలో పరుష పదజాలాన్ని వాడినా సహించేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







