ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు
- July 24, 2018
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ నేడు 42వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మంత్రులు మొక్కలు నాటారు. ఆపై రక్తదాన శిబిరం నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు కావడంతో ప్రజాప్రతినిధులు, అభిమానులు, టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేటీఆర్ ట్విట్టర్ పేజీలో జన్మదిన శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. విషెష్ చెప్పిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెప్తూ రీట్వీట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..