వీకెండ్‌లో అల్‌ ఖౌద్‌ రోడ్డు మూసివేత

- July 27, 2018 , by Maagulf
వీకెండ్‌లో అల్‌ ఖౌద్‌ రోడ్డు మూసివేత

మస్కట్‌: అల్‌ ఖౌద్‌ కమర్షియల్‌ రోడ్‌ స్ట్రీట్‌, ఈ వారంతంలో మూసివేయనున్నారు. జులై 26 సాయంత్రం నుంచి జులై 28 ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రెగ్యులర్‌ మెయిన్‌టెనెన్స్‌ నిమిత్తం ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ని ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్ళిస్తున్నామని మస్కట్‌ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సహకారంతో ఈ చర్యలు చేపట్టారు. అల్‌ ఖౌద్‌ కమర్షియల్‌ ఏరియాలో అల్‌ ఖౌద్‌ కమర్షియల్‌ రోడ్‌ మధ్యలో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్‌ సిబ్బంది సూచనల మేరకు వాహనాల్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్ళించాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com