అబుదాబీ రోడ్లపై ఇకపై నో మోర్ గ్రేస్ స్పీడ్ లిమిట్స్
- July 27, 2018
అబుదాబీ:ఆగస్ట్ 12 నుంచి నిర్దేశిత స్పీడ్ లిమిట్‌ని మించి వాహనదారులు వేగంతో వెళ్ళడానికి వీల్లేదు. ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఇకపై వుండదని అబుదాబీ పోలీస్ పేర్కొంది. రోడ్లపై రాడార్లను తదనుగుణంగా మార్పులు చేయడం జరిగిందని అబుదాబీ పోలీస్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అబుదాబీ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మొహ్మద్ ఖల్ఫాన్ అల్ రొమైతి మాట్లాడుతూ, రోడ్ యాక్సిడెంట్స్ ఇండెక్స్ మరియు ట్రాఫిక్ డెన్సిటీపై పలు అధ్యయనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటిదాకా స్పీడ్ లిమిట్స్‌ని మించి గంటకు 20 కిలోమీటర్ల మేర గ్రేస్ పీరియడ్‌ని వాహనదారులకు అమలు చేస్తూ వచ్చారు. ఉదాహరణకి ఓ రోడ్డుపై 120 కిలోమీటర్ల వేగం మాత్రమే ప్రయాణించాల్సి వుండగా, దాన్ని మించి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా రాడార్లు పసిగట్టవు. 141 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడే రాడార్లు గుర్తిస్తాయి. ఆగస్ట్ 12 నుంచి మాత్రం 121 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించినా రాడార్లు గుర్తిస్తాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







